వరంగల్ రూరల్ కలెక్టర్‌కు హైకోర్టు షాక్
దిశ, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాశ్ రెడ్డిపై కలెక్టర్ విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు గురువారం స్టే విధించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పెద్దకోడెపాక సర్పంచ్ ప్రకాష్ రెడ్డి బహిష్కరించిన విషయం తెలిసిందే. 33 బై 11 కెవి సబ్ స్టేషన్‌కు స్థలం కేటాయింపు విషయంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ ప్రకాశ్ రెడ్డి గ్రామసభను బహిష్కరించారు. […]
దిశ, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాశ్ రెడ్డిపై కలెక్టర్ విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు గురువారం స్టే విధించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పెద్దకోడెపాక సర్పంచ్ ప్రకాష్ రెడ్డి బహిష్కరించిన విషయం తెలిసిందే. 33 బై 11 కెవి సబ్ స్టేషన్‌కు స్థలం కేటాయింపు విషయంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ ప్రకాశ్ రెడ్డి గ్రామసభను బహిష్కరించారు. దీంతో కలెక్టర్ సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. సరైన సమాధానం రాకపోవడంతో ఆరు నెలల పాటు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రకాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ నేతృత్వంలోని ధర్మాసనం సర్పంచ్ ప్రకాష్ రెడ్డి అప్పీల్ పరిశీలించి కలెక్టర్ ఉత్తర్వులపై స్టే విధించడంతో పాటు ప్రతి వాదులను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి, న్యాయవాది రచన రెడ్డి అందుకు తగిన సలహాలు సూచనలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.