జగన్ సర్కార్ పై హైకోర్ట్ సీరియస్.. ఎందుకంటే ?
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్ లైన్ విధానంలో చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు వద్దంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఇంటర్‌లో ప్రవేశాలను గతంలో మాదిరే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గత నెల 26న ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా.. వాదనలు పూర్తిస్థాయిలో విన్న ధర్మాసనం […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్ లైన్ విధానంలో చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు వద్దంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఇంటర్‌లో ప్రవేశాలను గతంలో మాదిరే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గత నెల 26న ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా.. వాదనలు పూర్తిస్థాయిలో విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లకు స్పష్టమైన విధివిధానాలు లేవని పిటిషనర్లు వాదనలు వినిపించారు. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి తదితరులు ఆన్ లైన్ అడ్మిషన్ల అంశంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.