ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని ఆదేశాలు
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో నేడు జరగాల్సిన ఎంసెట్ రెండో ఫేజ్ కౌన్సెలింగ్ ఆపాలని జేఎన్టీయూకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం… పాస్ మార్కులు వేసి అందరినీ ఉత్తీర్ణులను చేసింది. కాగా, ఎంసెట్ రాయాలంటే ఇంటర్మీడియట్‌లో 45శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం […]
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో నేడు జరగాల్సిన ఎంసెట్ రెండో ఫేజ్ కౌన్సెలింగ్ ఆపాలని జేఎన్టీయూకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం… పాస్ మార్కులు వేసి అందరినీ ఉత్తీర్ణులను చేసింది. కాగా, ఎంసెట్ రాయాలంటే ఇంటర్మీడియట్‌లో 45శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విస్మరించింది.
ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. ఎంసెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేస్తుందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. కాగా, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని జేఎన్టీయూను ధర్మాసనం ఆదేశించింది.