వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు: హైకోర్టు

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని ఆదేశిస్తూ, ఆధార్ కాలమ్ తొలగించేవరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని స్పష్టం చేసింది. కులం, కుటంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని తెలిపిన హైకోర్టు.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగ వచ్చని తేల్చి […]

Update: 2020-12-17 06:05 GMT
Telangana High Court
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని ఆదేశిస్తూ, ఆధార్ కాలమ్ తొలగించేవరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని స్పష్టం చేసింది. కులం, కుటంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని తెలిపిన హైకోర్టు.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగ వచ్చని తేల్చి చెప్పింది.

న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని, ప్రజల సున్నితమైన సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే మా ఆందోళన అన్న ధర్మాసనం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసి తమకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

Tags:    

Similar News