బతికి ఉన్నాడా లేదా చెప్పండి: హైకోర్టు

దిశ, న్యూస్‌బ్యూరో: వనస్థలిపురానికి చెందిన కరోనా పేషంట్ ( నెంబర్ 1053) బతికే ఉన్నారా లేదా ఈ విషయంపై కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం ఎందుకివ్వలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సదరు వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో పూర్తి నివేదికను జూన్‌ 5 వరకు సమర్పించాలని ఆదేశించింది. కరోనా పేషంట్ నెంబర్ 1053 బతికే ఉన్నారా లేదా తెలుసుకునేందుకు ఆయన భార్య మాధవి హైకోర్టులో హేబీయస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. కొవిడ్ […]

Update: 2020-06-04 10:10 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: వనస్థలిపురానికి చెందిన కరోనా పేషంట్ ( నెంబర్ 1053) బతికే ఉన్నారా లేదా ఈ విషయంపై కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం ఎందుకివ్వలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సదరు వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో పూర్తి నివేదికను జూన్‌ 5 వరకు సమర్పించాలని ఆదేశించింది. కరోనా పేషంట్ నెంబర్ 1053 బతికే ఉన్నారా లేదా తెలుసుకునేందుకు ఆయన భార్య మాధవి హైకోర్టులో హేబీయస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. కొవిడ్ లక్షణాలతో ఏప్రిల్ 30న తన భర్తను గాంధీ ఆస్పత్రికి తరలించారని, మే 1న మధ్యాహ్నం 12 గంటలకు వరకూ ఆయన తనతో మాట్లాడారని, ఆ తర్వాత మొబైల్ పోన్ స్విచ్ఛాఫ్ అయిందని ఆమె తెలిపింది. మాధవి మామ ఈశ్వరయ్య ఏప్రిల్ 29న కరోనా లక్షణాలతో మృతి చెందగా.. జీహెచ్ఎంసీనే అంత్యక్రియలు చేసిందని అందులో పేర్కొన్నారు. మాధవి, ఆమె ఇద్దరు పిల్లలను కింగ్ కోఠి ఆస్పత్రికి మే 1న తరలించి, రక్త నమూనాలు సేకరించారు. ఫలితాలను చెప్పకుండానే మరుసటి రోజు తమను గాంధీ ఆస్పత్రిలోని క్వారెంటైన్ వార్డుకు తరలించారని పిటీషన్‌లో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా పేషంట్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు చూసేలా స్థానిక పోలీసులు వీడీయో రికార్డ్ చేయాలని ఉందని, తన భర్త చనిపోతే అలాంటి వీడీయో ఆధారాలేవీ పోలీసులు తమకివ్వలేదని పిటీషనర్ వాదించారు. ఇదే విషయంపై ఆమె మే 20వ తేదీన ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపారు. తన భర్త చనిపోలేదని, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాస్తుందని అనుమానిస్తున్నానని మాధవి కోర్టుకు తెలిపారు. ఒకవేళ తన భర్త చనిపోతే ఇప్పటివరకు హాస్పిటల్ గానీ, జీహెచ్ఎంసీ గానీ మరణ ధృవీకరణ పత్రాలను ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.

Tags:    

Similar News