హైకోర్టు ఆదేశాలతో దిగొచ్చిన జగన్ సర్కార్

దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగించాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు రంగులు వేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం కూడా ఈ అంశంపై హైకోర్టులో […]

Update: 2021-10-06 07:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగించాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు రంగులు వేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం కూడా ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. భవిష్యత్‍లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.

Tags:    

Similar News