గణేష్ ఉత్సవాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ,వెబ్‌డెస్క్ : గణేష్ ఉత్సవాలపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వినాయకుని ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించవద్దంటూ ఆదేశించింది. అంతే కాకుండా హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను నిమజ్జనం చేయాలంటూ సూచించింది. వినాయకుని మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడ కూడదని, అలాగే చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు తెలిపింది.