రాజధాని భూములపై హైకోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంంలో సేకరించిన భూములు ఇతర ప్రాంతాలకు చెందిన పేదవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతి అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను ఇతర ప్రాంత వాసులకు కేటాయించడం సరికాదంటూ సీఆర్డీఏ పరిధిలోని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములను అక్కడి పేదలకు మాత్రమే కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని రైతుల తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో ఆ భూములను దుగ్గిరాల, విజయవాడ, […]

Update: 2020-03-23 06:29 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంంలో సేకరించిన భూములు ఇతర ప్రాంతాలకు చెందిన పేదవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతి అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను ఇతర ప్రాంత వాసులకు కేటాయించడం సరికాదంటూ సీఆర్డీఏ పరిధిలోని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములను అక్కడి పేదలకు మాత్రమే కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని రైతుల తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో ఆ భూములను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి ప్రాంత వాసులకు కేటాయించడం చట్ట విరుద్ధమని ఆయన వాదించారు. అవే భూముల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించి దుగ్గిరాల, మంగళగిరి ప్రాంతాలు కూడా సీఆర్డఏ పరిధిలోనే ఉన్నాయని, వాటి కేటాయింపులు కూడా ఆపాలని న్యాయస్థానానికి తెలిపారు. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే విధించింది.
Tags: high court, ap, crda, house land scheme, amaravathi

Tags:    

Similar News