హయత్‌నగర్‌లో ఉద్రిక్తత
దిశ, ఎల్బీనగర్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ జాతీయ రహదారిపై రియల్టర్లు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మీడియా ప్రతినిధులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళనకారుల అభిప్రాయాలను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల వద్ద వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం […]
దిశ, ఎల్బీనగర్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ జాతీయ రహదారిపై రియల్టర్లు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మీడియా ప్రతినిధులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళనకారుల అభిప్రాయాలను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల వద్ద వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి కెమెరాలు లాక్కుని పక్కకు తోసేశారు.