దాతలారా.. అడుగు ముందుకు వేయండి : నారప్ప పిలుపు

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కోరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కాగా వైరస్‌ను అరికట్టడానికి ఇప్పటికే పలువురు తారలు తమ ఉదారతను చాటుతూ, ఆర్థిక సాయం చేశారు. అంతేగాకుండా ఒకరిని చూసి మరోకరు ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. తాజాగా మారోసారి వినూత్న ప్రచారానికి తెరతీశారు. ప్లాస్మాను దానం చేయడం ద్వారా వైరస్‌ బాధితులను కాపాడవచ్చునని వెద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వారియర్స్ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని టాలీవుడ్ సెలబ్రిటీలు విజ్ఞప్తి […]

Update: 2020-07-27 05:32 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కోరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కాగా వైరస్‌ను అరికట్టడానికి ఇప్పటికే పలువురు తారలు తమ ఉదారతను చాటుతూ, ఆర్థిక సాయం చేశారు. అంతేగాకుండా ఒకరిని చూసి మరోకరు ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. తాజాగా మారోసారి వినూత్న ప్రచారానికి తెరతీశారు. ప్లాస్మాను దానం చేయడం ద్వారా వైరస్‌ బాధితులను కాపాడవచ్చునని వెద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వారియర్స్ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని టాలీవుడ్ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా చిరంజీవి, నాగార్జున, అమల, మహేశ్‌, సాయితేజ్ తదితరులు ప్లాస్మా దానం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.

తాజాగా మరో అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ స్పందించాడు. దీనిపై మాట్లాడుతూ.. సైతం ప్లాస్మా దాతలు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మాను దానం చేయాలని సైబరాబాద్ పోలీసుశాఖ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను షేర్ చేసిన వెంకటేశ్.. ‘‘ప్లాస్మా దాతలారా! అడుగు ముందుకేయండి. ప్లాస్మాను దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని కామెంట్‌ చేస్తు పోస్టు చేశారు.

Tags:    

Similar News