ఎలుకకు ‘గోల్డ్’ మెడలట..తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: మనుషుల ప్రాణాలను జంతువులు కాపాడటం అరుదేం కాదు. సరిగ్గా శిక్షణ పొందిన జాగిలాలు ఎన్నో సార్లు బాంబుల నుంచి పోలీసులు, సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాయి. ఆఫ్రికాకు చెందిన ఎలుక కూడా అలాంటి పనే చేసి, ఇప్పుడు బంగారు పతకం సంపాదించింది. ఆఫ్రికన్ జెయింట్ ఎలుక ల్యాండ్ మైన్‌లను గుర్తించి ప్రతిష్టాత్మక బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ ఎలుక పేరు మగావా. దాని కెరీర్‌లో 39 ల్యాండ్‌మైన్‌లు, 28 మ్యూనిషన్‌లను గుర్తించింది. కాంబోడియాలో డ్యూటీ […]

Update: 2020-09-25 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనుషుల ప్రాణాలను జంతువులు కాపాడటం అరుదేం కాదు. సరిగ్గా శిక్షణ పొందిన జాగిలాలు ఎన్నో సార్లు బాంబుల నుంచి పోలీసులు, సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాయి. ఆఫ్రికాకు చెందిన ఎలుక కూడా అలాంటి పనే చేసి, ఇప్పుడు బంగారు పతకం సంపాదించింది. ఆఫ్రికన్ జెయింట్ ఎలుక ల్యాండ్ మైన్‌లను గుర్తించి ప్రతిష్టాత్మక బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ ఎలుక పేరు మగావా. దాని కెరీర్‌లో 39 ల్యాండ్‌మైన్‌లు, 28 మ్యూనిషన్‌లను గుర్తించింది. కాంబోడియాలో డ్యూటీ చేస్తూ ప్రమాదకర ల్యాండ్‌మైన్‌లను గుర్తించింది.

ఈ ఎలుకకు ఇచ్చిన పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. కానీ, ఈ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే. ఏడేండ్ల వయసున్న ఈ ఎలుకను బెల్జియం దేశానికి చెందిన అపోపో చారిటీ సంస్థ ట్రైన్ చేసింది. ఈ సంస్థ ప్రత్యేకంగా ఎలుకలకు శిక్షణనిస్తుంది. వీటిని ‘హీరో రాట్స్’ అనే పేరుతో సమాజ సేవ కోసం పోలీసు బలగాలకు పంపిస్తారు. 1990ల నుంచి ఈ సంస్థ ఎలుకలను ట్రైన్ చేస్తోంది. ఎలుక పేరు మీద అపోపో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టాఫ్ కొక్స్ పతకాన్ని అందుకున్నారు.

Tags:    

Similar News