హీరో మోటోకార్ప్ ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్..

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కంపెనీ బోర్డులో స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్‌ను నియమిస్తున్నట్టు తెలిపింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. ‘రజనీష్ కుమార్ ఎస్‌బీఐలో దాదాపు 4 దశాబ్దాల పాటు సేవలందించారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంశాల్లో ఆయన నైపుణ్యానికి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం హెచ్ఎస్‌బీసీ, భారత్‌పే, ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్ సహా పలు […]

Update: 2021-11-26 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కంపెనీ బోర్డులో స్వతంత్ర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్‌ను నియమిస్తున్నట్టు తెలిపింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. ‘రజనీష్ కుమార్ ఎస్‌బీఐలో దాదాపు 4 దశాబ్దాల పాటు సేవలందించారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంశాల్లో ఆయన నైపుణ్యానికి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం హెచ్ఎస్‌బీసీ, భారత్‌పే, ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్ సహా పలు ప్రతిష్ఠాత్మక కంపెనీ బోర్డులలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని’ హీరో మోటోకార్ప్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో వివరించింది.

అలాగే, చాక్లెట్ స్టార్టప్ కంపెనీ చోకో లాను స్థాపించిన వసుధ దినోడియాను కూడా కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇటీవల కామిలె టాంగ్‌ను సైతం డైరెక్టర్ల బోర్డులో నియమించడం ద్వారా కంపెనీ మొత్తం 11 మంది బోర్డు సభ్యులను కలిగి ఉంది. వీరిలో 25 శాతం మంది మహిళలు ఉన్నారని, దీనిద్వారా కంపెనీ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందనే నమ్మకం ఉందని హీరో మోటోకార్ప్ వెల్లడించింది.

Tags:    

Similar News