ఎలక్ట్రిక్ టూ-వీలర్ ధరలు తగ్గించిన హీరో కంపెనీ

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ హీరో తన ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల్లో పలు మోడళ్ల ధరలను తగ్గించింది. ఫేమ్-2 పథకం ద్వారా లభించే రాయితీని కేంద్రం పెంచిన కారణంగా 33 శాతం వరకు ధరల తగ్గింపును శుక్రవారం కంపెనీ ప్రకటించింది. ఫేమ్-2 పథకం ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, సింగిల్ బ్యాటరీ వేరియంట్ వాహనాలపై 12 శాతం, ట్రిపుల్ బ్యాటరీ వేరియంట్ వాహనాలపై 33 శాతం తగ్గిస్తున్నామని కంపెనీ ఓ […]

Update: 2021-06-25 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ హీరో తన ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల్లో పలు మోడళ్ల ధరలను తగ్గించింది. ఫేమ్-2 పథకం ద్వారా లభించే రాయితీని కేంద్రం పెంచిన కారణంగా 33 శాతం వరకు ధరల తగ్గింపును శుక్రవారం కంపెనీ ప్రకటించింది. ఫేమ్-2 పథకం ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, సింగిల్ బ్యాటరీ వేరియంట్ వాహనాలపై 12 శాతం, ట్రిపుల్ బ్యాటరీ వేరియంట్ వాహనాలపై 33 శాతం తగ్గిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ధరల ప్రకారం.. ఫోటాన్ హెచ్ఎక్స్ మోడల్ ధార రూ. 79,940 నుంచి రూ. 71,449కి లభిస్తుంది.

ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ ధర రూ. 1.13 లక్షల నుంచి రూ. 85,136కే విక్రయించనున్నట్టు కంపెనీ పేర్కొంది. అదేవిధంగా, ఆప్టిమా ఐఆర్ రూ. 58,980కే లభిస్తుందని వెల్లడించింది. ‘ భవిష్యత్తులో సాధారణ వినియోగంలోకి రానున్న ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇప్పటి నిర్ణయాల వల్ల రాబోయే 5 ఏళ్లలో 50-70 లక్షల వాహనాలు రోడ్లపై ఉండొచ్చని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. కేంద్రం ఇటీవల 1 కిలోవాట్‌కు రూ. 15 వేల సబ్సీడీని పెంచింది. వాహన ఖరీదులో సబ్సిడీని 20 నుంచి 40 శాతానికి పెంచింది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు ఆ మేరకు ప్రయోజనాలను వినియోగదారులకు కల్పిస్తున్నాయి. ఈ మధ్యనే టీవీఎస్, ఆథర్ ఎనర్జీ, యాంపియర్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించినట్టు ప్రకటించాయి.

Tags:    

Similar News