ఏ ఒక్కరినీ వదలొద్దు

దిశ, క్రైమ్ బ్యూరో : చందానగర్ శ్మశానవాటికలో హేమంత్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం ముగిశాయి. యూకే నుంచి హేమంత్ సోదరుడు సుశాంత్ వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ సమయంలో ఒక్కసారి కండ్లు తెరువు హేమంత్ అని హేమంత్ భార్య అవంతి అన్న మాటలు, తన కొడుకు కన్నా.. ముందుగా తనను పాడె మీద పడుకోబెట్టాలని తల్లి లక్ష్మీరాణిల రోదన స్థానికులను కంట తడి పెట్టించింది. ఈ సందర్బంగా వదిన అవంతిని హేమంత్ […]

Update: 2020-09-26 12:06 GMT

దిశ, క్రైమ్ బ్యూరో :
చందానగర్ శ్మశానవాటికలో హేమంత్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం ముగిశాయి. యూకే నుంచి హేమంత్ సోదరుడు సుశాంత్ వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ సమయంలో ఒక్కసారి కండ్లు తెరువు హేమంత్ అని హేమంత్ భార్య అవంతి అన్న మాటలు, తన కొడుకు కన్నా.. ముందుగా తనను పాడె మీద పడుకోబెట్టాలని తల్లి లక్ష్మీరాణిల రోదన స్థానికులను కంట తడి పెట్టించింది. ఈ సందర్బంగా వదిన అవంతిని హేమంత్ సోదరుడు సుశాంత్ పట్టుకుని బోరున విలపించాడు. మా అన్న చావుకు కారణమైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సుశాంత్ డిమాండ్ చేశారు. హత్యకు కంటే రెండు రోజుల ముందుగానే వ్యాపార సంబంధిత అంశాలపై ఫోన్ లో చర్చించుకున్నట్టు సుశాంత్ తెలిపాడు. తన అన్నను చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశాడు. కులాంతర వివాహం చేసుకుంటే హత్య చేస్తారా అంటూ సుమంత్ ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా, తన భర్తను హత్య చేయించిన అమ్మా, నాన్న, మామయ్యలను ఎన్ కౌంటర్ చేయాలని అవంతి డిమాండ్ చేశారు. ఏ నా కొడుకునూ వదిలి పెట్టేది లేదన్నారు. నిందితులు ఎవరూ బెయిల్ తో బయటకు రాకుండా చేయాలని పోలీసులను అవంతి కోరారు. ఇన్నాళ్లు ఇలాంటి మనుషుల మధ్య బ్రతికానా.. అని ఇప్పుడు అన్పించిందనీ అవంతి అన్నారు. రెండు నెలల్లో అమెరికా వెళ్దామని అనుకున్నామనీ కానీ, ఇంతలో ఈ ఘోరం చేశారని అవంతి కన్నీరు మున్నీరు అయ్యారు.

Tags:    

Similar News