తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతవరణ శాఖ తెలిపింది. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. భారత వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడనున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతవరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం […]
దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతవరణ శాఖ తెలిపింది. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. భారత వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడనున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతవరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని కారణంగా రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలకు వచ్చే అవకాశముందన్నారు. ఈ ప్రభావంతో తెలంగాణలో 2021, జూన్ 03వ తేదీ గురువారం నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి.