ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం 48.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి.
భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం 48.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు అయితే ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. వీటి ప్రాభావంతో తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.