మరోసారి మునిగిన మహానగరం..

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైని మరోసారి భారీ వర్షాలు ముంచ్చెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దేశ ఆర్థిక రాజధాని తడిసిముద్ద అయ్యింది. లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహాదారులపై మోకాల్లమట్టు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులకు గరవుతున్నారు. పలుప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచి పోయింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. వర్షాల తీవ్రతను బట్టి లోకల్ ట్రైన్స్ సర్విసులను కూడ […]

Update: 2021-06-15 23:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైని మరోసారి భారీ వర్షాలు ముంచ్చెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దేశ ఆర్థిక రాజధాని తడిసిముద్ద అయ్యింది. లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహాదారులపై మోకాల్లమట్టు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులకు గరవుతున్నారు. పలుప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచి పోయింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. వర్షాల తీవ్రతను బట్టి లోకల్ ట్రైన్స్ సర్విసులను కూడ నిలిపివేసే ఆలోచన చేస్తున్నారు అధికారులు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో వీఎమ్‌సీ అధికారులు అప్రమత్తం అయ్యి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భారీ వర్షాల కారణంగా ముంబైకి వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Tags:    

Similar News