హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నదిలా మారిన రోడ్డు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ప్రధానంగా మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మియాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ లక్డీకపూల్, హిమాయత్‌నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం […]

Update: 2021-08-23 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ప్రధానంగా మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మియాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ లక్డీకపూల్, హిమాయత్‌నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ప్రస్తుతం ఓ మోస్తారు వర్షం కురుస్తోంది.

Tags:    

Similar News