ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచనలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా 3.1 ఎత్తున ఆవరించి ఉందని ప్రకటించారు. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురియనున్నాయి. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా 3.1 ఎత్తున ఆవరించి ఉందని ప్రకటించారు.
ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురియనున్నాయి. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. శుక్రవారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా సాదాశివపేటలో 7.మిమీ వర్షాపాతం నమోదైంది.