దంచికొట్టిన వాన.. పిట్లం- బాన్సువాడ మధ్యలో రాకపోకలు బంద్

దిశ, పిట్లం : గత పది రోజులుగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పిట్లం మండలం‌లోని రాంపూర్ గ్రామ శివారులో రామసముద్రం మత్తడికి వర్షపు నీరు రావడంతో మత్తడి అలుగు పారుతోంది. దీంతో పిట్లం బాన్సువాడ మధ్యలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జి‌పై నుంచి వాగు పారుతుంది. రాంపూర్ గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో మత్తడిపడి వాగు పారడంతో బాన్సువాడ, పిట్లం రాకపోకలు ప్రతిసారి నిలిచిపోతాయన్నారు. లో లెవెల్ బ్రిడ్జి‌ని […]

Update: 2021-09-05 23:01 GMT

దిశ, పిట్లం : గత పది రోజులుగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పిట్లం మండలం‌లోని రాంపూర్ గ్రామ శివారులో రామసముద్రం మత్తడికి వర్షపు నీరు రావడంతో మత్తడి అలుగు పారుతోంది. దీంతో పిట్లం బాన్సువాడ మధ్యలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జి‌పై నుంచి వాగు పారుతుంది. రాంపూర్ గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో మత్తడిపడి వాగు పారడంతో బాన్సువాడ, పిట్లం రాకపోకలు ప్రతిసారి నిలిచిపోతాయన్నారు. లో లెవెల్ బ్రిడ్జి‌ని హైలెవెల్ బ్రిడ్జి‌గా మార్చాలని సర్పంచ్ కోరారు. వాహనదారులు బాన్సువాడ‌కు వెళ్లేవారు వేరే దారిని ఎంచుకుని వెళ్ళగలరని ఆయన సూచించారు. గౌరారం సర్పంచ్ అనసూయ శంకర్ భాస్కర్ నుంచి వచ్చే వారిని అక్కడే నిలిపివేశారు. రాంపూర్ పాఠశాలకు వచ్చే విద్యార్థులు రావద్దని ఆయన కోరారు. వాగు దగ్గర ఇద్దరు వీఆర్ఏ‌‌ల‌ను నియమించారు.

Tags:    

Similar News