భారీ వర్షానికి తిరుపతి జలమయం.. గుడిలోకి వరద నీరు (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో తిరుపతి నగరం అంధకారంలో మునిగిపోయింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు మునిగిపోయాయి. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ […]

Update: 2021-11-18 21:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో తిరుపతి నగరం అంధకారంలో మునిగిపోయింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.

భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు మునిగిపోయాయి. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం కోసం 0877-2256766 నెంబరును సంప్రదించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.

మరోవైపు తిరుపతి దేవాలయం ఎదుట భారీగా వరద నీరు చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో కూడా వరద నీరు పోటెత్తింది. తిరుపతి వీధుల్లో వరద నీటి ప్రవాహంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

Tags:    

Similar News