హైదరాబాద్‌లో భారీ వర్షం.. నిరుత్సాహంలో అమ్మవారి భక్తులు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి చల్లటి వాతావరణం కాస్తా మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ప్రధానంగా మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మియాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు […]

Update: 2021-10-16 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి చల్లటి వాతావరణం కాస్తా మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ప్రధానంగా మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మియాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో అమ్మవార్లు నిమర్జనానికి సిద్ధమవుతున్న తరుణంలో వర్షం ఆర్గనైజర్లకు తలనొప్పిగా మారింది. భారీ లైటింగ్‌లకు అడ్వాన్సులు ఇచ్చామని.. తీరా శోభయాత్ర ముంగిట వర్షం ఇబ్బంది పెడుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News