భారీ వర్షం.. చిత్తడైన ‘దళితబంధు’ సభా ప్రాంగణం
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ మండలం శాలపల్లి(ఇందిరానగర్) ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఆదివారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి సభ ప్రాంగణ సమీపంలోని రోడ్ల మీదకు నీరు చేరి గుంతల్లో నిండిపోయింది. జేసీబీతో సభ ప్రాంగణం చుట్టూ మూడు ఫీట్ల మేర కాలువ తవ్వించారు. కంకరతో గుంతల రోడ్లు పూడ్చివేయించారు. బురదమయం అయిన మట్టి రోడ్లపై కంకర వేసి లెవలింగ్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ మండలం శాలపల్లి(ఇందిరానగర్) ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఆదివారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి సభ ప్రాంగణ సమీపంలోని రోడ్ల మీదకు నీరు చేరి గుంతల్లో నిండిపోయింది. జేసీబీతో సభ ప్రాంగణం చుట్టూ మూడు ఫీట్ల మేర కాలువ తవ్వించారు. కంకరతో గుంతల రోడ్లు పూడ్చివేయించారు. బురదమయం అయిన మట్టి రోడ్లపై కంకర వేసి లెవలింగ్ చేశారు. హెలిప్యాడ్ వద్దకు వాన నీరు నిలిచిపోవడంతో హుటాహుటిన తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. సీఎం సభాస్థలికి చేరుకునే సరికి పరిస్థితిని చక్కదిద్దే పనిలో అధికారయంత్రాంగం అంతా నిమగ్నమైంది.