వరంగల్‌లో భారీ వర్షం… జలమయమైన రహదారులు

దిశ, వరంగల్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో అత్యధికంగా 9 మిల్లీ మీటర్లపైగా వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు మొదలైన వర్షం రాత్రి 7 గంటల వరకూ కొనసాగింది. దీంతో వరంగల్ బస్టాండ్, హన్మకొండ బస్టాండ్ రోడ్లు చెరువులను తలపించాయి. కాజీపేట, హన్మకొండ పెట్రోల్ పంప్, హన్మకొండ చౌరస్తా, […]

Update: 2020-07-14 08:10 GMT

దిశ, వరంగల్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో అత్యధికంగా 9 మిల్లీ మీటర్లపైగా వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు మొదలైన వర్షం రాత్రి 7 గంటల వరకూ కొనసాగింది. దీంతో వరంగల్ బస్టాండ్, హన్మకొండ బస్టాండ్ రోడ్లు చెరువులను తలపించాయి. కాజీపేట, హన్మకొండ పెట్రోల్ పంప్, హన్మకొండ చౌరస్తా, వరంగల్ పోచమ్మైదాన్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. నగరంలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా రానున్న రెండు, మూడ్రోజుల్లో వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News