నగరంలో మళ్లీ భారీ వర్షం

దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్‌ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరిగి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అమీర్‌పేట, హిమాయత్ నగర్, పాతబస్తీ, బేగంపేట, బోయిన్‌పల్లి, నాంపల్లి, ప్యారడైజ్, కోఠి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, జీడీమెట్ల, బాలానగర్, మలక్‎పేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు […]

Update: 2020-10-19 20:24 GMT

దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్‌ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరిగి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అమీర్‌పేట, హిమాయత్ నగర్, పాతబస్తీ, బేగంపేట, బోయిన్‌పల్లి, నాంపల్లి, ప్యారడైజ్, కోఠి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, జీడీమెట్ల, బాలానగర్, మలక్‎పేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News