గుమస్తాను బంధించి 7 కేజీల బంగారం, 30 లక్షలు చోరీ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే మరో దొంగల భయం పట్టుకుంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు తమ పని తాము కానిస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. కొందరు దుండగులు ఓ షాపులోకి చొరబడి భారీగా నగలు, నగదు ఎత్తుకెళ్లారు. గుమస్తాను బంధించి 7 కేజీల బంగారం, రూ. 30 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో […]

Update: 2020-07-24 03:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే మరో దొంగల భయం పట్టుకుంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు తమ పని తాము కానిస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. కొందరు దుండగులు ఓ షాపులోకి చొరబడి భారీగా నగలు, నగదు ఎత్తుకెళ్లారు. గుమస్తాను బంధించి 7 కేజీల బంగారం, రూ. 30 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో ఆ గుమస్తా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Tags:    

Similar News