బిర్యానీ కోసం జనాలు క్యూ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తుండటంతో జనాలు రోడ్లపై తిరగడానికి జంకుతున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల పరిస్థితి చెప్పనక్కర లేదు. కస్టమర్లు లేక హోటళ్లు వెలవెలబోతున్నాయి. అయితే ఓ హోటల్ యజమాని ప్రస్తుత పరిస్థితులకు తగట్టుగా వినూత్నంగా ఆలోచనతో చికన్ ధమ్ బిర్యానీని తయారు చేస్తున్నాడు. హోటల్ బయట రోగనిరోధక శక్తి చిర్యానీ అని బోర్డు కూడా పెట్టాడు. దీంతో కస్టమర్లు ఆ హోటల్‌కు పోటెత్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది. బిర్యానీ కోసం […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తుండటంతో జనాలు రోడ్లపై తిరగడానికి జంకుతున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల పరిస్థితి చెప్పనక్కర లేదు. కస్టమర్లు లేక హోటళ్లు వెలవెలబోతున్నాయి. అయితే ఓ హోటల్ యజమాని ప్రస్తుత పరిస్థితులకు తగట్టుగా వినూత్నంగా ఆలోచనతో చికన్ ధమ్ బిర్యానీని తయారు చేస్తున్నాడు. హోటల్ బయట రోగనిరోధక శక్తి చిర్యానీ అని బోర్డు కూడా పెట్టాడు. దీంతో కస్టమర్లు ఆ హోటల్‌కు పోటెత్తున్నారు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది. బిర్యానీ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీ స్థాయిలో వచ్చి తీసుకెళ్తున్నారు. బిర్యానీలో రోగనిరోధక శక్తిని పెంచే దాల్చిన చక్క, శొంఠి, మిరియాలు, లవంగాలు, ఉసిరి, తులసి పౌడర్‌ను ఉపయోగిస్తున్నట్లు ఐస్ ల్యాండ్ హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు.