గ్లోబల్ నుంచి కిమ్స్‌కు గుండె తరలింపు
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి అంబులెన్స్ ద్వారా గుండె (లైవ్)ను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్డీకపూల్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి మినిస్టర్ రోడ్ కిమ్స్ ఆస్పత్రి వరకూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 10.46 గంటలకు గ్లోబల్ నుంచి బయలుదేరిన లైవ్ ఆర్గాన్ (హార్ట్) 5.6కిలోమీటర్ల దూరం కలిగిన కిమ్స్‌కు కేవలం 5నిమిషాల్లో చేరుకునేలా జాగ్రత్తలు చేపట్టారు. దీంతో ఈ ఏడాది […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి అంబులెన్స్ ద్వారా గుండె (లైవ్)ను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్డీకపూల్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి మినిస్టర్ రోడ్ కిమ్స్ ఆస్పత్రి వరకూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 10.46 గంటలకు గ్లోబల్ నుంచి బయలుదేరిన లైవ్ ఆర్గాన్ (హార్ట్) 5.6కిలోమీటర్ల దూరం కలిగిన కిమ్స్‌కు కేవలం 5నిమిషాల్లో చేరుకునేలా జాగ్రత్తలు చేపట్టారు. దీంతో ఈ ఏడాది (2020)లో ఎంతో విలువైన ప్రాణాలను రక్షించడంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవయవ రవాణాకు 12సార్లు సదుపాయం కల్పించడం విశేషం.