సుశాంత్ సింగ్ మృతిపై ఇప్పటి వరకు కేసుపెట్టలేదు
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతూనే ఉంది. సుశాంత్ సూసైడ్ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఇటీవల రియా చక్రవర్తి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. బీహార్ నుంచి కేసు విచారించేందుకు వచ్చిన అధికారిని ముంబయి పోలీసులు క్వారంటైన్ తరలించడం ఏంటని ప్రశ్నించింది. కేసును నిజాయితీగా పరిశీలించాలని పోలీసులకు సూచించింది. ముంబై పోలీసుల చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని హెచ్చరించింది. ఇప్పటి […]
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతూనే ఉంది. సుశాంత్ సూసైడ్ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఇటీవల రియా చక్రవర్తి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది.
బీహార్ నుంచి కేసు విచారించేందుకు వచ్చిన అధికారిని ముంబయి పోలీసులు క్వారంటైన్ తరలించడం ఏంటని ప్రశ్నించింది. కేసును నిజాయితీగా పరిశీలించాలని పోలీసులకు సూచించింది. ముంబై పోలీసుల చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రిపోర్టులను మూడు రోజుల్లోనే తమకు సమర్పించాలని తేల్చి చెప్పింది. కాగా, సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బీహార్ ప్రభుత్వం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే, సుశాంత్ కేసును సీబీఐకి తరలించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం విభేదించింది. కావాలనే ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కోర్టుకు తెలిపింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పూర్తిగా మంబై పోలీసుల పరిధిలోకే వస్తోందని వివరణ ఇచ్చింది. అటు బీహార్ పోలీసులు కొంతమంది రాజకీయ నేతల ప్రొత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సుప్రీంకోర్టుకు మహా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కనీసం సుశాంత్ తండ్రి ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కడా కూడా ఫిర్యాదు చేయలేని కోర్టుకు గుర్తు చేసింది.