స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!
అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. చాలా మంది ఆరోగ్య పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన స్ట్రోక్ బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని కొన్ని భాగాలకు రక్తం
దిశ, ఫీచర్ : అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. చాలా మంది ఆరోగ్య పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన స్ట్రోక్ బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడం వలన వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని, ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి, లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువలన ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలను గురించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కాగా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. స్ట్రోక్ రావడానికి ముందు మైకంలా వచ్చి కళ్లు తిరిగి పడిపోవడం.
2.ఆకస్మిక గందరగోళం, మాట్లాడటం కష్టం లేదా ప్రసంగాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది.
3. వెర్టిగో రావడం.. దీని వల్ల కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది.
4. నీరసం, బలహీనంగా మారడం లాంటిది జరుగుతుంది.
5. కాళ్లు, చేతుల్లో పక్షవాతం రావడం, సరిగా మాట్లాడలేకపోవడం జరుగుతుంది.
6. కంటి చూపు సరిగా ఉండక పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది.
7.ముఖం, చేయి లేదా కాలు, ముఖ్యంగా ఒక వైపు ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత.
8.ఒకటి లేదా రెండు కళ్లలో ఆకస్మిక ఇబ్బంది.ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక, తీవ్రమైన తలనొప్పి