డెల్టా, ఒమిక్రాన్ త‌ర్వాత క‌రోనా 4వ వేవ్‌లో విజృంభించే వైర‌స్ ఇదే..?! ల‌క్ష‌ణాలు ఇవే..?!

తాజాగా కోవిడ్ 4వ వేవ్ సూచ‌న‌లు అందుతున్నాయి. Corona 4th Wave started, which is mixed of Delta and Omicron variants.

Update: 2022-03-23 12:35 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంపై ప‌గ‌బ‌ట్టి మూడేళ్లు అవుతోంది. ఇప్ప‌టికే మూడు ద‌శ‌ల్లో మ‌నుషుల్ని ముచ్చెరువుల నీళ్లు తాగించింది. ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ త‌ర్వాత‌ ఇటీవ‌ల వ‌చ్చిన‌ ఓమిక్రాన్ ధాటికి ప్ర‌పంచ జ‌నాభా ఉక్కిరిబిక్కిర‌య్యారు. ఇక త‌గ్గిపోతుందిలే అనుకుంటున్న త‌రుణంలో మ‌రో రూపంలో విరుచుకుప‌డుతోంది. మూడో వేవ్ త‌ర్వాత‌ జీవితం సాధారణ స్థితికి వస్తుందనే ఆశతో చాలా దేశాలు కోవిడ్-19 ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ, తాజాగా కోవిడ్ 4వ వేవ్ సూచ‌న‌లు అందుతున్నాయి. ఇప్ప‌టికే, యూరప్, దక్షిణ కొరియాతో సహా అనేక ఆసియా దేశాల్లో 4వ వేవ్ మొద‌ల‌యిన‌ట్లు వార్త‌లు అందుతున్నాయి. ఈ క్ర‌మంలో 4వ వేవ్‌లో వ‌చ్చే కొత్త వేరింట్ ఏంటా అని స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

అయితే, రెండు, మూడు ద‌శ‌ల్లో భ‌య‌కంపితుల్ని చేసిన డెల్టా, ఓమిక్రాన్‌లు క‌లిసి వ‌స్తుందే ఈ 4వ వేవ్ వేరియంట్ అని ఇప్ప‌టికే నివేదిక‌లు అందుతున్నాయి. 'డెల్టాక్రాన్‌'గా పిలుస్తున్న ఈ హైబ్రిడ్ జాతిని ఇప్ప‌టికే ప‌లు దేశాలు ధృవీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. దీనితో ప్ర‌స్తుతం దక్షిణ కొరియాలో ఆసుపత్రిలో చేరుతున్న‌వారితో పాటు మరణాలు పెరుగుతున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డిస్తోంది. ఈ స‌రికొత్త వేరియంట్ 'డెల్టాక్రాన్‌'ను మొదటిసారిగా, ఫిబ్రవరి మధ్యలో, యూకే ఆరోగ్య అధికారులు ధృవీక‌రించారు. కోవిడ్-19 డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌లు రెండింటినీ ఒకే సమయంలో ఒక రోగిలో నిర్ధారణ చేసినట్లు, దాన్ని 'డెల్టాక్రాన్' అని పిలుస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మొద‌టిసారి, ఇది ప్రయోగశాలలో లోపం వ‌ల్ల జ‌రిగింద‌ని అనుకున్న‌ప్ప‌టికీ త‌ర్వాత అది నిజమని తేలింది.

'డెల్టాక్రాన్' ల‌క్ష‌ణాలుః

తలనొప్పి

అధిక జ్వరం,

విప‌రీత‌మైన చెమటలు లేదా చలితో కూడిన జ్వ‌రం

గొంతు మంట

తీవ్ర‌మైన‌ దగ్గు

తీవ్ర‌ అలసట లేదా శక్తి కోల్పోవడం

రుచి, వాసన లేక‌పోవ‌డం లేదా మార్పు

Tags:    

Similar News