కరోనా నివారణకు పాలకూరకి లింక్ ఇదే….
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వైద్యులు తరచూ ఇస్తున్న సలహా… “రోగనిరోధక శక్తి (immunity power) పెంచుకోండి”. ఎవరికైతే ఇమ్మ్యూనిటి పవర్ ఎక్కువ ఉంటుందో వారికి రోగం వెంటనే తగ్గిపోతుంది అని చెబుతున్నారు. ఇమ్మ్యూనిటి పెంచే ఫుడ్స్ (immunity boosters) లో పాలకూర (spinach) ఒకటి. అంతేకాదు ఈ ఆకుకూర తినడం వలన కోవిడ్-19 లక్షణాలలో ఒకటైన రక్తం గడ్డకట్టడాన్ని (blood clotting) అరికట్టడంతో పాటు లంగ్స్ క్షీణించకుండా కాపాడుతుంది. పాలకూరలో లభించే కే విటమిన్ (K vitamin) అందుకు దోహదపడుతుంది. ఈ విషయాన్ని కోవిడ్-19 రీసెర్చ్ ప్రాజెక్టుకై పని చేస్తున్న సైంటిస్ట్ డా.రాబర్ట్ జాన్సెన్ తెలిపారు. పాలకూరలో విటమిన్-ఏ (vitamin A), విటమిన్-సి (vitamin […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వైద్యులు తరచూ ఇస్తున్న సలహా… “రోగనిరోధక శక్తి (immunity power) పెంచుకోండి”. ఎవరికైతే ఇమ్మ్యూనిటి పవర్ ఎక్కువ ఉంటుందో వారికి రోగం వెంటనే తగ్గిపోతుంది అని చెబుతున్నారు. ఇమ్మ్యూనిటి పెంచే ఫుడ్స్ (immunity boosters) లో పాలకూర (spinach) ఒకటి.
అంతేకాదు ఈ ఆకుకూర తినడం వలన కోవిడ్-19 లక్షణాలలో ఒకటైన రక్తం గడ్డకట్టడాన్ని (blood clotting) అరికట్టడంతో పాటు లంగ్స్ క్షీణించకుండా కాపాడుతుంది. పాలకూరలో లభించే కే విటమిన్ (K vitamin) అందుకు దోహదపడుతుంది. ఈ విషయాన్ని కోవిడ్-19 రీసెర్చ్ ప్రాజెక్టుకై పని చేస్తున్న సైంటిస్ట్ డా.రాబర్ట్ జాన్సెన్ తెలిపారు.
పాలకూరలో విటమిన్-ఏ (vitamin A), విటమిన్-సి (vitamin C), విటమిన్-ఇ (vitamin E), విటమిన్-కే (vitamin K), కాల్షియమ్ (calcium), ఐరన్(Iron), ప్రోటీన్స్ (protiens), మినరల్స్ (minerals) సమృద్ధిగా ఉండటం వలన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.
పాలకూరను ఆహారంగా తీసుకోవడం వలన అండాశయ కాన్సర్(ovarian cancer) కి చెక్ పెట్టవచ్చు. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్ కేంప్ఫెరాల్… అండాశయ క్యాన్సర్ ముప్పు నుండి కాపాడుతుందని రీసెర్చ్ లో వెల్లడైనట్టు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ International journal of cancer ప్రచురించింది.
భారతదేశంలో ఎక్కువశాతం గర్భవతులు, బాలింతలు, పసిపిల్లలు రక్తహీనత (అనీమియా anemia)కు గురవుతున్నారు. పాలకూరను ఎక్కువగా తినడం వలన ఇందులో ఉండే ఐరన్ (Iron) రక్తహీనతను దరిచేరనివ్వదు. మహిళల అందాన్ని పెంచుతుంది.
పాలకూరలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ఈ ఆకుకూర జ్వరం, పిత్తం, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి దంతాలను, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
భారత దేశంలో విటమిన్-ఏ లోపంతో ఏటా దాదాపు 30 వేల మంది ఐదేళ్ల లోపు పిల్లలు కంటిచూపును కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పాలకూరలో లభించే కెరోటిన్ (carotene) విటమిన్ ఏ గా మరి అంధత్వం రాకుండా చూస్తుంది.
వారంలో ఎక్కువసార్లు మనం తినే ఆహారంలో పాలకూరను చేర్చుకుంటే మంచి పోషక విలువలు లభిస్తాయి. పాలకూరను ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు. ఇలా చేస్తే అందులో ఉండే విటమిన్స్ ఆవిరైపోతాయి. సో పాలకూరను గ్రీన్ స్మూతీస్ (green smoothies) లో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి.