నకిలీ డీఎస్పీతో సిద్దిపేట హెడ్ కానిస్టేబుల్ భారీ మోసం
దిశ ప్రతినిధి, మెదక్: ఖాకీ చొక్కా వేసుకునేదే శాంతి భద్రతలను రక్షించడం, అవినీతి తిమింగిలలాను పట్టుకోవడం.. మోసపూరిత చర్యలకు పాల్పడే వారిని శిక్షించడం లాంటి చర్యలు చేయడానికి. కానీ, కొందరు పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్నాం.. మనకేం కాదని భావించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో నకిలీ డీఎస్పీ విషయంలో సిద్దిపేటకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ హస్తం ఉందని వస్తున్న సమాచారమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు […]
దిశ ప్రతినిధి, మెదక్: ఖాకీ చొక్కా వేసుకునేదే శాంతి భద్రతలను రక్షించడం, అవినీతి తిమింగిలలాను పట్టుకోవడం.. మోసపూరిత చర్యలకు పాల్పడే వారిని శిక్షించడం లాంటి చర్యలు చేయడానికి. కానీ, కొందరు పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్నాం.. మనకేం కాదని భావించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో నకిలీ డీఎస్పీ విషయంలో సిద్దిపేటకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ హస్తం ఉందని వస్తున్న సమాచారమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
నకిలీ డీఎస్పీతో స్నేహం..
డీఎస్పీ నంటూ అమాయక ప్రజల నుండి భారీగా డబ్బులు దోచుకున్న నకిలీ డీఎస్పీ స్వామి హైదరాబాద్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. కామారెడ్డిలో మొదలైన అక్రమ వసూళ్ల దందా సిద్దిపేట వరకు విస్తరించింది. సిద్దిపేటలో నకిలీ డీఎస్పీకి సహకరించింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టిన అధికారులకు సిద్దిపేట వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్టు తెలిసింది. నకిలీ డీఎస్పీతో చేతులు కలిపి సిద్దిపేటలో పలువురు నిరుద్యోగులకు టీఎస్ పీఎస్సీ, ఇతర డిపార్టుమెంట్లలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి భారీగా డబ్బులు దండుకున్నట్టు సమాచారం. దాదాపు ఒక్కో నిరుద్యోగి వద్ద సుమారు రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సిద్దిపేట వన్ టౌన్‌లో పనిచేస్తోన్న హెడ్ కానిస్టేబుల్‌ను శుక్రవారం సిద్దిపేట టూ టౌన్ పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన నుంచి కీలక ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు అనధికారిక సమాచారం.
గతంలోనూ విమర్శలు..
జిల్లా ప్రజలు మోసపోకుండా.. సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ అధికారులు ఎంత శ్రమిస్తున్నా.. సిద్దిపేట పోలీస్ శాఖకు ఆ మచ్చ తొలిగేలా కన్పించడం లేదు. సిద్దిపేటలో అవినీతి రహిత పాలన అందించాలన్న లక్ష్యం నీరు గారుతోంది. కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతుండటమే ఇందుకు నిదర్శనం. నకిలీ డీఎస్పీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ గతమంతా గందరగోళంగా ఉండేది. ఆయన విషయమై ఎవర్ని సంప్రదించినా.. ఆయన మంచోడు కాదనే చెబుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడటం.. లంచాలు తీసుకోవడం.. అక్రమ సంబంధాలు కొనసాగించాడని నేరుగా చెబుతున్నారు. అలాంటి హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే విధుల్లో నుండి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.