హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సమయంలో దేశంలో వివిధ సంస్థల్లోని ఉద్యోగులు అనేక సవాళ్లను ఎదుర్కొని ఉద్యోగాలను కొనసాగించారు. ఇప్పటికీ కరోనా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ ప్రముఖ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్‌ను అందజేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బడా కంపెనీలు ఈ మేరకు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ అతిపెద్ద […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సమయంలో దేశంలో వివిధ సంస్థల్లోని ఉద్యోగులు అనేక సవాళ్లను ఎదుర్కొని ఉద్యోగాలను కొనసాగించారు. ఇప్పటికీ కరోనా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ ప్రముఖ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్‌ను అందజేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఫ్లిప్‌కార్ట్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బడా కంపెనీలు ఈ మేరకు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాయి.
తాజాగా ఈ జాబితాలోకి దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కూడా చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థలోని ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఖర్చు భరించనున్నట్టు పేర్కొంది. రెండు మోతాదులకు అవసరమైన ఖర్చును అందించనున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ‘లాక్‌డౌన్ సయంలో వినియోగదారులకు బ్యాంకింగ్ వంటి అవసరమైన సేవలను అందించి వారికి భరోసా ఇచ్చారని, అందుకు కృతజ్ఞతగా వ్యాక్సిన్ ద్వారా కరోనా నుంచి రక్షణ కల్పించాలని నిర్ణయించినట్టు’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ అషిమా భట్ వెల్లడించారు.