కొత్త ఏడాదిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొత్త ఛైర్మన్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2021లో కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్ట్‌టైమ్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న శ్యామలా గోపీనాథ్ పదవీకాలం జనవరి 1తో ముగుస్తుంది. ఈ క్రమంలో సోమవారం బ్యాంకు బోర్డు సమావేశమై అర్హులైన పేరును ఆర్‌బీఐకి సిఫారసు చేసినట్టు సమాచారం. శ్యామలా గోపీనాథ్ 2015, జనవరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్‌బీఐ అనుమతి రాగానే కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయనున్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. […]

Update: 2020-12-29 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2021లో కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్ట్‌టైమ్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న శ్యామలా గోపీనాథ్ పదవీకాలం జనవరి 1తో ముగుస్తుంది. ఈ క్రమంలో సోమవారం బ్యాంకు బోర్డు సమావేశమై అర్హులైన పేరును ఆర్‌బీఐకి సిఫారసు చేసినట్టు సమాచారం. శ్యామలా గోపీనాథ్ 2015, జనవరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్‌బీఐ అనుమతి రాగానే కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయనున్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది.

అయితే, కొత్త అభ్యర్థి బాధ్యతలు తీసుకునే వరకూ తాత్కాలిక ఛైర్మన్‌గా విధులను నిర్వర్తించేందుకు స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరిని ఎంపిక చేయనుంది. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తిని నియమించేందుకు ఆమోదించినట్టు సమాచారం.అతాను చక్రవర్తి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే దీని గురించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అతాను చక్రవర్తి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

Tags:    

Similar News