అత్యున్నత యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ సెకండ్
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోని అత్యున్నత యూనివర్సిటీల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది. 2019, 2020 ఏడాదిల్లోనూ హెచ్‌సీయూ వరుసగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇండియా టుడే మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ) నిర్వహించిన ఈ సర్వేలో జేఎన్‌యూ మొదటిస్థానంలో నిలవగా.. హెచ్‌సీయూ రెండో స్థానంలో నిలిచింది. ఇండియా టుడే సర్వేల్లో హెచ్‌సీయూ 2017 లో ఐదో స్థానం, 2018 లో మూడో, 2019లో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోని అత్యున్నత యూనివర్సిటీల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది. 2019, 2020 ఏడాదిల్లోనూ హెచ్‌సీయూ వరుసగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇండియా టుడే మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ) నిర్వహించిన ఈ సర్వేలో జేఎన్‌యూ మొదటిస్థానంలో నిలవగా.. హెచ్‌సీయూ రెండో స్థానంలో నిలిచింది. ఇండియా టుడే సర్వేల్లో హెచ్‌సీయూ 2017 లో ఐదో స్థానం, 2018 లో మూడో, 2019లో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని యూనివర్సిటీల్లోని సాధారణ, టెక్నికల్, మెడికల్, లీగ్.. నాలుగు అంశాలను పరిశీలించి ర్యాంకులు కేటాయించారు.
ఇండియా టుడే ఉత్తమ యూనివర్సిటీల సర్వేలో భాగంగా జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన 155 విద్యాసంస్థలతో కలిపి మొత్తం 995 యూనివర్సిటీలను పరిగణలోకి తీసుకున్నారు. చివరకు 130 యూనివర్సిటీలకు ర్యాంక్‌లు కేటాయించారు. ఎండీఆర్ఏ 120రకాల మౌలిక అంశాల ప్రశ్నలను రూపొందించారు. అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్, మౌలిక సదుపాయాలు, లీడర్షిప్, కెరీర్, జాబ్ ప్లేస్ మెంట్ విషయాల ఆధారంగా యూనివర్సిటీల ర్యాంకింగ్స్ కేటాయించారు. 32నగరాల్లోని 32మంది వీసీలను, 75మంది డైరక్టర్లు / రిజిస్ట్రార్స్, 193 మంది సీనియర్ ప్రొఫెసర్లు/ హెచ్ఓడీలను కలిపి మొత్తం 300 మందిని సర్వేలో భాగం చేశారు. 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకూ నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను ఇండియా టుడే ప్రకటించింది.
మరింత మెరుగుపడేందుకు అవకాశం
– పి. అప్పారావు, వైస్ ఛాన్స్లర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
మూడేళ్ల నుంచి సర్వే ర్యాంక్‌ల్లో యూనివర్సిటీ స్థానం ఎగబాకుతోంది. ఈ సారి రెండో స్థానంలో నిలిచింది. పనితీరును మెరుగుపరుచుకునేందుకు సర్వే ర్యాంకింగ్స్ ఛాలెంజ్ విసురుతుంది. పనితీరు, పరిశోధనల్లో మరింత మరింత వృద్ధిని కొనసాగిస్తామని నమ్మకం ఉంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై యూనివర్సిటీ దృష్టి సారిస్తుంది, ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్‌లోకి చేరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.