హర్యానా సీఎంకు నిరసనల సెగ

చండీగడ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనల సెగ ఆయనకు తాకింది. అంబాలా సిటీ నుంచి వెళ్తున్న సీఎం కాన్వాయ్‌ను రైతు ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొత్త సాగు చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన విరమించబోమని రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు నియంత్రించడంతో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కాన్వాయ్ చిన్నపాటి అంతరాయంతో […]

Update: 2020-12-22 08:59 GMT

చండీగడ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనల సెగ ఆయనకు తాకింది. అంబాలా సిటీ నుంచి వెళ్తున్న సీఎం కాన్వాయ్‌ను రైతు ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొత్త సాగు చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన విరమించబోమని రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు నియంత్రించడంతో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కాన్వాయ్ చిన్నపాటి అంతరాయంతో బయటపడగలిగింది.

Tags:    

Similar News