హరీష్ రావు ప్రచారంపై నెట్టింట చర్చ.. కొంపముంచుతున్న గ్యాస్ సిలిండర్
దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు కొందరు నామినేషన్ దాఖలు చేసి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికలో మొత్తం 30 మంది ఉన్నారు. ఇందులో వివిధ పార్టీల వారితో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు. […]
దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు కొందరు నామినేషన్ దాఖలు చేసి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికలో మొత్తం 30 మంది ఉన్నారు. ఇందులో వివిధ పార్టీల వారితో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు.
మంత్రి హరీష్ రావు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించడమే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర పరిధిలో ఉండే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై మండిపడుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రతిచోట ప్రచారంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ను ముందుంచుతున్నారు. దీనిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్ కు ఎన్నికల సంఘం గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.‘‘ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్ తరఫున ప్రచారం చేస్తున్న హరీష్ రావు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్ గారి
(గుర్తు గ్యాస్ సిలిండర్) తరుపున ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న తెరాస అభ్యర్ధి గెళ్లు శీను అన్న మరియు మంత్రి హరిశ్ రావు గారు🤣🔥 #HuzurabadByPoll #huzurabadbyelection pic.twitter.com/AfxVhhBDal— Share Telangana (@ShareTelangana) October 21, 2021