కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి హరీష్ రావు కీలక లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు హరీష్ రావు లేఖ రాశారు. కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని కోరారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలన్న సదుద్దేశంతో 84 రోజుల వ్యవధిని 4 నుంచి 6 వారాలకు కుదించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు, హై రిస్క్ పర్సన్స్‌కు వెంటనే బూస్టర్ డోస్‌ను తీసుకురావాలని […]
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు హరీష్ రావు లేఖ రాశారు. కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని కోరారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలన్న సదుద్దేశంతో 84 రోజుల వ్యవధిని 4 నుంచి 6 వారాలకు కుదించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు, హై రిస్క్ పర్సన్స్‌కు వెంటనే బూస్టర్ డోస్‌ను తీసుకురావాలని కోరారు.
కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 2.49 కోట్ల ఫస్ట్ డోస్, 1.28 కోట్ల సెకండ్ డోస్‌లు అందించినట్లు ఆయన కేంద్రానికి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.