దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే !
దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా తనదేనని, బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో మంత్రి రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి కాల బైరవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాక ముందు రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదని, కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. […]
దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా తనదేనని, బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో మంత్రి రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి కాల బైరవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాక ముందు రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదని, కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదో ప్రజలు ఆలోచించుకోవలన్నారు. బీజేపీ వాళ్ల తిట్లకు భయపడనని, వాటిని దీవెనలుగా తీసుకొని ఇంకా బలపడతానన్నారు. బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిస్తున్న 5రాష్ట్రాల్లో ఎక్కడైనా 24గంటల ఉచిత కరెంట్, ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.