పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అండ: హరీశ్‌రావు
దిశ, మెదక్: పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆదివారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెక్కులను వెంటనే బ్యాంకులో జమ చేసుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వం అందజేస్తున్న 12కిలోల బియ్యం, రూ1200 తీసుకున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ […]
దిశ, మెదక్: పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆదివారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెక్కులను వెంటనే బ్యాంకులో జమ చేసుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వం అందజేస్తున్న 12కిలోల బియ్యం, రూ1200 తీసుకున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, మైనారిటీ కౌన్సిలర్లు జావేద్, మోయిజ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: minister Harish Rao, distributed, Kalyana Lakshmi, check, medak