భూసేకరణకు రైతులు సహకరించాలి: హరీశ్ రావు

దిశ, మెదక్: రైతుల త్యాగ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భూదేవి గార్డెన్స్‎లో బుధవారం నియోజకవర్గ పరిధి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్ మినహా.. జిల్లాలోని మిగతా మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చాయన్నారు. త్వరలోనే మల్లన్న సాగర్ నీటిని సిద్దిపేటకు తెస్తామని చెప్పారు. ఇందుకోసం రైతులు పెద్ద మనస్సుతో భూసేకరణకు ప్రభుత్వానికి సహకరించాలని […]

Update: 2020-05-13 05:16 GMT

దిశ, మెదక్: రైతుల త్యాగ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భూదేవి గార్డెన్స్‎లో బుధవారం నియోజకవర్గ పరిధి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్ మినహా.. జిల్లాలోని మిగతా మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చాయన్నారు. త్వరలోనే మల్లన్న సాగర్ నీటిని సిద్దిపేటకు తెస్తామని చెప్పారు. ఇందుకోసం రైతులు పెద్ద మనస్సుతో భూసేకరణకు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News