అతని బౌలింగ్‌తో ఒరిగేది ఏమీ లేదు.. కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఆటగాడు, కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి వరల్డ్‌ కప్‌లో హార్దిక్ బౌలింగ్ వేయకపోతే మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలను ప్రభావితం చేయవన్నారు. కేవలం రెండు ఓవర్లు వేస్తే టీమిండియాకు కలిసొస్తుందని జోస్యం చెప్పాడు. కానీ, ఆల్‌రౌండర్స్ మ్యాచ్‌లను చాలా ప్రభావితం చేస్తారని.. ఇద్దరు ఆల్‌రౌండర్‌లు అందుబాటులో ఉంటే కెప్టెన్ సామర్థ్యాన్ని పెంచుతుందని కపిల్ దేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో […]

Update: 2021-10-19 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఆటగాడు, కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి వరల్డ్‌ కప్‌లో హార్దిక్ బౌలింగ్ వేయకపోతే మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలను ప్రభావితం చేయవన్నారు. కేవలం రెండు ఓవర్లు వేస్తే టీమిండియాకు కలిసొస్తుందని జోస్యం చెప్పాడు. కానీ, ఆల్‌రౌండర్స్ మ్యాచ్‌లను చాలా ప్రభావితం చేస్తారని.. ఇద్దరు ఆల్‌రౌండర్‌లు అందుబాటులో ఉంటే కెప్టెన్ సామర్థ్యాన్ని పెంచుతుందని కపిల్ దేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా బౌలింగ్‌‌ను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్‌‌లో బౌలింగ్ వేయలేదు. ఈ క్రమంలోనే వరల్డ్‌ కప్‌లో హార్దిక్ బౌలింగ్ వేస్తాడా.. వేయడా అనే విషయంపై కపిల్ దేవ్ విమర్శనాత్మక కామెంట్లు చేయడం గమనార్హం.

Tags:    

Similar News