మొల్గర కాజ్వేపై దుందుభి పరుగులు

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గడిచిన రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలంలో మొల్గర – ఉల్పర గ్రామాలను కలిపే ప్రధాన రహదారి కాజ్వే పై రాత్రి నుండి ఇప్పటివరకు దుందుభి వాగు ఉరకలు వేస్తుంది. ఉప్పునుంతల మండలంలోని దుందుబీ వాగు […]

Update: 2020-08-03 22:19 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గడిచిన రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది.

ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలంలో మొల్గర – ఉల్పర గ్రామాలను కలిపే ప్రధాన రహదారి కాజ్వే పై రాత్రి నుండి ఇప్పటివరకు దుందుభి వాగు ఉరకలు వేస్తుంది. ఉప్పునుంతల మండలంలోని దుందుబీ వాగు సమీపంలోగల గ్రామాల ప్రజలు వర్షాలు కురిసి, వాగు ఉరకలు వేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రైతులు వరినాట్లను నాటుతున్న క్రమంలో వర్షాలు కురుస్తుండడంతో దుందుభి వాగు పరుగులు పెడుతుండటం వలన రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది.

Tags:    

Similar News