గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని.. వివాహిత ఆత్మహత్య
దిశ, డిండి: గ్రామ శివారు లోని చెట్టుకు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామానికి చెందిన శ్రీలత (24), అదే గ్రామానికి చెందిన జుట్టు చెన్నయ్య లు ఒకరినొకరు ప్రేమించుకుని 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా కుటుంబ సభ్యుల నుంచి మాకు రక్షణ […]
దిశ, డిండి: గ్రామ శివారు లోని చెట్టుకు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామానికి చెందిన శ్రీలత (24), అదే గ్రామానికి చెందిన జుట్టు చెన్నయ్య లు ఒకరినొకరు ప్రేమించుకుని 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా కుటుంబ సభ్యుల నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా పోలీసు సిబ్బంది ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
అనంతరం వారు వారి స్వగ్రామంలోనే కిరాణా షాపును నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ గత కొంత కాలంగా భర్త చిన్నయ్య, కుటుంబ సభ్యులు వరకట్నం తీసుకురావాలని వేధించడంతో గురువారం రాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి సోదరుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచయ్య తెలిపారు.