చెక్‌పోస్టు సిబ్బందికి మంత్రి జగదీశ్‌రెడ్డి సాయం
దిశ, నల్లగొండ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రామాపురం చెక్‌పోస్టు సిబ్బందికి మంత్రి జగదీశ్‌రెడ్డి రెండు టన్నుల బత్తాయిలతోపాటు జ్యూస్ మిషన్లు అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన చెక్ పోస్టు సందర్శించగా సిబ్బంది మండుటెండల్లో విధులు నిర్వర్తించడాన్నిగమనించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం బత్తాయి జ్యూస్ తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. తమకు బత్తాయిలు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడంతో వెంటనే అందిస్తామంటూ వారికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే […]
దిశ, నల్లగొండ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రామాపురం చెక్‌పోస్టు సిబ్బందికి మంత్రి జగదీశ్‌రెడ్డి రెండు టన్నుల బత్తాయిలతోపాటు జ్యూస్ మిషన్లు అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన చెక్ పోస్టు సందర్శించగా సిబ్బంది మండుటెండల్లో విధులు నిర్వర్తించడాన్నిగమనించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం బత్తాయి జ్యూస్ తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. తమకు బత్తాయిలు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడంతో వెంటనే అందిస్తామంటూ వారికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే అక్కడికి 2 టన్నుల బత్తాయిలతోపాటు రెండు జ్యుస్ మిషన్లు చేరాయి. వీటిని కోదాడ ఆర్డీఓ కిశోర్ కుమార్, డీఎస్పీ రఘు, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డిలతోపాటు కోదాడ, మునగాల తహసీల్దార్లు సైదులు ఆధ్వర్యంలో సిబ్బందికి అందజేశారు.
Tags: Minister jagadish reddy,distributes juice machine,Rampur checkpost