భైంసా to శబరిమల.. గురుస్వామి 1,100 కిలోమీటర్ల పాదయాత్ర
దిశ, ముధోల్ : భైంసా టు శబరిమలై దాదాపు 1,100 కిలోమీటర్ల పాదయాత్రకై మంగళవారం ఉదయం పట్టణానికి చెందిన కోర్వ శ్రీనివాస్ అయ్యప్ప గురుస్వామి పయనమయ్యారు. వివరాల్లోకి వెళితే గత సంవత్సరం కరోనా సెకండ్ వేవ్‌లో తమ బాబాయ్ ఆనారోగ్యంతో బాధపడగా తమ బాబాయ్ తొందరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరుకున్నారు. అలాగే, ఆరోగ్యం కుదుటపడిన తరువాత శబరిమలైకి కాలినడక ప్రయాణం అవుతాను అని మొక్కుకొని మంగళవారం ఆ మొక్కు కోసం శబరిమలైకి పయనమైనట్టు తెలిపారు. […]
దిశ, ముధోల్ : భైంసా టు శబరిమలై దాదాపు 1,100 కిలోమీటర్ల పాదయాత్రకై మంగళవారం ఉదయం పట్టణానికి చెందిన కోర్వ శ్రీనివాస్ అయ్యప్ప గురుస్వామి పయనమయ్యారు. వివరాల్లోకి వెళితే గత సంవత్సరం కరోనా సెకండ్ వేవ్‌లో తమ బాబాయ్ ఆనారోగ్యంతో బాధపడగా తమ బాబాయ్ తొందరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరుకున్నారు. అలాగే, ఆరోగ్యం కుదుటపడిన తరువాత శబరిమలైకి కాలినడక ప్రయాణం అవుతాను అని మొక్కుకొని మంగళవారం ఆ మొక్కు కోసం శబరిమలైకి పయనమైనట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రజలు, బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు ఈ స్వామి పాదయాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించారు. సొంత ఇంట్లోనే కష్టం వస్తే ముఖం చాటేసే ఈ రోజుల్లో ఇలా తమ బాబాయ్ ఆరోగ్యం కుదుటపడాలని ఇంత పెద్ద యాత్రకి పూనుకోవడం హర్షించదగ్గ విషయమని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ యాత్ర ప్రారంభన్ని చూడటానికి భైంసా పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామల జనాలు సైతం విచ్చేశారు.