స్టూడెంట్స్‌తో ఆ పని చేయిస్తున్న కాంట్రాక్టర్.. పేరెంట్స్‌కు తెలియడంతో..!

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థుల చేత క్యాటరింగ్ పని చేయించిన ఘటన వెలుగుచూసింది. ఈ గురుకుల కళాశాలలో క్యాటరింగ్ టెండర్ దక్కించుకుని సరిగ్గా పనులు చేయకపోవడంతో విద్యార్థులే క్యాటరింగ్ పనులు చేశారు. గత కొద్ది నెలల నుండి కాంట్రాక్టర్ కళాశాలలో సరిపడ వర్కర్స్‌ను కేటాయించలేదు. దీంతో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పని మనుషులుగా అవతారమెత్తాల్సి వచ్చింది. కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా, తమ పరిధిలోకి రాని […]

Update: 2021-10-28 05:37 GMT

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థుల చేత క్యాటరింగ్ పని చేయించిన ఘటన వెలుగుచూసింది. ఈ గురుకుల కళాశాలలో క్యాటరింగ్ టెండర్ దక్కించుకుని సరిగ్గా పనులు చేయకపోవడంతో విద్యార్థులే క్యాటరింగ్ పనులు చేశారు. గత కొద్ది నెలల నుండి కాంట్రాక్టర్ కళాశాలలో సరిపడ వర్కర్స్‌ను కేటాయించలేదు. దీంతో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పని మనుషులుగా అవతారమెత్తాల్సి వచ్చింది.

కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా, తమ పరిధిలోకి రాని పనులను బలవంతంగా చేయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది సరిపడా లేక, పుస్తకాలు, పెన్నులు పట్టాల్సిన చేతులతో పాచి పనులు చేయిస్తున్నారు. విద్యార్థులు పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గిరిజన గురుకుల కళాశాల నిర్వహణ, అధికారుల పై భగ్గుమంటున్నారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News