గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు అవసరం

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అవస్థలు పడుతున్న వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని గల్ఫ్ సంక్షేమ సంఘం కోరింది.ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నకిలీ ఏజెంట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీనిపై […]

Update: 2020-12-06 10:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అవస్థలు పడుతున్న వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని గల్ఫ్ సంక్షేమ సంఘం కోరింది.ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నకిలీ ఏజెంట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

దీనిపై మంత్రి, ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించడమే కాకుండా, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి భవన నిర్మాణ రంగంలో న్యాక్ ద్వారా టెక్నికల్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వేముల వివరించారు. దీనిని గ్రామీణ స్థాయిలో విస్తృత పరిచేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి, కవితను కలిసిన వారిలో సంఘం నాయకుడు నర్సింహ నాయుడు, గల్ఫ్ జేఏసీ నాయకుడు రవి గౌడ్, వేముల రమేష్, జనగామ శ్రీనివాస్, బాలకిషన్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News