కరోనా మృతుల నష్టపరిహారంపై మార్గదర్శకాలు

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన కుటుంబాలకు కేంద్రం ఇచ్చే నష్టపరిహారంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మృతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా డెత్ నిర్ధారణ కమిటీ తేల్చిన వివరాలనే రికార్డులలో పొందుపరిచామన్నారు. కేంద్రం నుంచి ఆదేశాలు రాగానే ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నష్టపరిహారం అందిస్తామన్నారు. రాష్ట్ర […]

Update: 2021-09-23 06:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన కుటుంబాలకు కేంద్రం ఇచ్చే నష్టపరిహారంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మృతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా డెత్ నిర్ధారణ కమిటీ తేల్చిన వివరాలనే రికార్డులలో పొందుపరిచామన్నారు.

కేంద్రం నుంచి ఆదేశాలు రాగానే ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నష్టపరిహారం అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయని, మరో రెండు నెలల వరకు వీటి ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా డెంగీపై అతి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.ప్లేట్ లెట్స్ దోపిడి చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై 104కు ఫిర్యాదు చేయాలన్నారు.

Tags:    

Similar News